Skip to main content

Posts

Showing posts from 2022

[English Poem] Paradox

After marching scorching hours, how did I end up on square one? After seeing beautiful heights, why do I find myself at the bottom? After fighting with courage, why am I still a coward? After meeting so many, why am I still lonely? After experiencing every emotion, why am I left with only pain? After realizing life is unfair, why do I still hope? After knowing hope is the only way to live, why do I stop to believe?

[Telugu Poem] రాతి గుండె

 ఏమయ్యా పరమేశ్వరా  నిండ తిరగడానికి అడవి తల్లి లేనే లేదు  గూడు కట్టడానికి కొమ్మైనా ఇయ్యకపోతివి  ఊరేగడానికి బల్గమేట్లాగు లేకపోతిది  గోడు చెప్పడానికి గుండెనైనా ఉంచకపోతివి  నిమ్మలంగ నిద్ర ఎట్లైనా రాకపోతిది  పీడకల నిజం కాదని గొంతైనా అనకపోతిది  నవ్వేటందుకు కారణమైతే కాన రాదాయె  ఏడ్చేటి ధైర్యమన్నా ఇయ్యరాదె మా కండ్లలో  శోకమైతే ఆగదాయె  నీ గుండెలో  చుక్క  కరుణ రాకపాయె 

[Telugu Poem] ఓ మనిషి కథ

గగనమంత ఉషస్సు నాది సముద్రమంత నిశీధి నాది  ఆనంద పర్వతాలు నావి విషాద పాతాళాలు నావి  ఉత్సాహభరిత గంతులు ఉల్లాసభరిత నవ్వులు ఉత్తేజభరిత ఊహలు అన్నీ నావే  మనస్సు మోయలేని భారాలు పెదవి విప్పలేని మౌనాలు కాలం చెరపలేని గాయాలు అవి కూడా నావే  ఆహ్లాద పరిచి సమయాన్ని మింగేసే సరదాలు ఆనంద పరిచి మార్పు రానివ్వని అలవాట్లు స్ఫూర్తినిచ్చి తృప్తిగా ఉండనివ్వని లక్ష్యాలు అవి కూడా నావే  పలకరించే బంధాలు ఆత్మీయత పంచే స్నేహాలు ప్రపంచం ఏకమైనా తాకలేని ఏకాంతలూ అన్నీ నావే  అహం దాటి పొంగే ఆదర్శాలు  అవధులు లేక సాగే కళా ఖండాలు  అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సామర్ధ్యాలు  అన్నీ నావే  నిజం మరచి మండే విద్వేషాలు  జాలి లేక కాల్చే మారణఖాండలు   కూర్చున్న కొమ్మనే నరికేసే మూర్ఖత్వాలు  అవి కూడా నావే  ఎంత బ్రహ్మ అయినా అబ్బురపడి చూసే మనిషిని నేను  ఎన్ని జన్మలైనా అర్ధం కాని మనసు నాది 

[Short Story] The Regret

    It was 5pm in the evening. Prithvi made the big decision and started his journey downwards from the 50th floor of the bank building which is his workplace.          He has been working at a huge commercial bank for 25 years. He started as an Assistant Manager and rose to the level of Vice President of the bank for the entire region of South India. Till 2 months before today, anyone would have agreed that he had a very successful career. But all that changed in a single day.          A financial fraud of never seen proportions was exposed a couple of months earlier. Entire banking system was taken for a ride by a trader, who was highly intelligent and crooked. Many people who had been working with him and had no idea what he was up to were shell shocked when the scam was revealed. Prithvi was one of them. Though the investigation revealed that he was innocent, he had a bigger problem to fac...

[Telugu poem] ఎందుకు?

 సర్వం క్షణికం అయినప్పుడు సంతోషం ఎందుకో అన్నీ  తాత్కాలికం అయినప్పుడు ఆశ ఎందుకో బాధ అనే సంద్రంలో కలిసే కోరకు ఉరకల ప్రేమ ధార ఎందుకో తాకలేని తీరాన్ని చూపి కాల్చే జ్ఞాపకాల జ్వాలెందుకు? బాధ్యతల సంకెళ్లు తొడిగే బంధాల వెంపర్లాట ఎందుకో స్వేచ్చకు సమాధి కట్టే నాగరికతా మేడలు ఎందుకో జీవితానికి అర్ధం ఇవ్వలేని వాటి కోసం ప్రయాస ఎందుకో మనసుకి అర్ధం అవ్వని వాటి కోసం మధనం ఎందుకో విస్తృత విశాల విశ్వంలో అణువంత ఉన్న నీ ఊహా ప్రపంచం కోసం ఆవేశం ఎందుకు? సృష్టి కాలమానంలో నీ చిటికెడు జీవితానికి దర్పం ఎందుకో