ఏమయ్యా పరమేశ్వరా నిండ తిరగడానికి అడవి తల్లి లేనే లేదు గూడు కట్టడానికి కొమ్మైనా ఇయ్యకపోతివి ఊరేగడానికి బల్గమేట్లాగు లేకపోతిది గోడు చెప్పడానికి గుండెనైనా ఉంచకపోతివి నిమ్మలంగ నిద్ర ఎట్లైనా రాకపోతిది పీడకల నిజం కాదని గొంతైనా అనకపోతిది నవ్వేటందుకు కారణమైతే కాన రాదాయె ఏడ్చేటి ధైర్యమన్నా ఇయ్యరాదె మా కండ్లలో శోకమైతే ఆగదాయె నీ గుండెలో చుక్క కరుణ రాకపాయె