నువ్వెక్కడున్నావు? నీ ఆలాపనే నాకు ఉత్తేజాన్ని ఇస్తుంది నువ్వెక్కడున్నావు? వీచే గాలి కూడా ప్రేమగా తాకుతుంది నువ్వెక్కడున్నావు? పెదవి పైన నవ్వు వీడనని కూర్చుంది నువ్వెక్కడున్నావు? అలసిన కనులు కూడా నక్షత్రాల లాగా మెరుస్తున్నాయి మనస్సు చిరాకులన్నీ మాని ఉరకలు పెడుతుంది ప్రతి శబ్దం సంగీతం అయ్యింది ప్రతి అడుగు నాట్యం అయ్యింది ప్రతి క్షణం అద్భుతంలా ఉంది ప్రతి భావం ఆహ్లాదంగా ఉంది నువ్వెక్కడున్నావు? నా శ్వాసలో నా ధ్యాసలో నా తలుపులో ప్రతి మలుపులో నువ్వెక్కడున్నావు? నా చలనంలో నా జ్వలనంలో నా ప్రాణంలో ప్రతి అణువులో అణువు దాటి అణువు చేరే దారిలో