చుక్క వెలుగు లేకుండా కప్పే కారు మబ్బులు కన్నీటి ధారకు ఊతమిచ్చే వాన నీటి ధార కంటి వెలుగు జాడ దాచిన కటిక చీకట్లు బతిమిలాడిన జంట చేరని కంటి కునుకు నిమిషాన్ని యుగం చేసి ఆస్వాదించే కాలం దగ్ధ హృదయానికి ఎదురు పడే ప్రతి వస్తువు జాలి లేని కరుడు కట్టిన శత్రువు కొన్ని క్షణాల నీ నవ్వుని అందించనీ గాలిని వింటూ గడిపేస్తా కాలాన్ని నీ మధుర స్వరాలలో మంచిని గుర్తుకు తేని కాలాన్ని చూసి శాంతించనీ మనసుని సంతోషాన్ని నింపిన నీ స్నేహపు జాడలను మరువొద్దను మనసుని వాటిని అభినందించని జీవితాన్ని కరుణార్ధ్రభర కమలా నాయన కిరణాలను నిమిషమైనా అందించనీ జీవితాన్ని ఆస్వాదించి చేరుకోని సుప్తావస్థని నువ్వు లేని సంవత్సరం, క్షణం కానివ్వు దాన్ని నువ్వు లేని జీవితం, దినం కానివ్వు దాన్ని ఎన్ని కోట్ల జన్మలైనా ఎత్తని గడియ పొందనివ్వు నీ స్నేహాన్ని...