చుక్క వెలుగు లేకుండా కప్పే కారు మబ్బులు
కన్నీటి ధారకు ఊతమిచ్చే వాన నీటి ధార
కంటి వెలుగు జాడ దాచిన కటిక చీకట్లు
బతిమిలాడిన జంట చేరని కంటి కునుకు
నిమిషాన్ని యుగం చేసి ఆస్వాదించే కాలం
దగ్ధ హృదయానికి ఎదురు పడే ప్రతి వస్తువు
జాలి లేని కరుడు కట్టిన శత్రువు
కొన్ని క్షణాల నీ నవ్వుని
అందించనీ గాలిని
వింటూ గడిపేస్తా కాలాన్ని
నీ మధుర స్వరాలలో మంచిని
గుర్తుకు తేని కాలాన్ని
చూసి శాంతించనీ మనసుని
సంతోషాన్ని నింపిన నీ స్నేహపు జాడలను
మరువొద్దను మనసుని
వాటిని అభినందించని జీవితాన్ని
కరుణార్ధ్రభర కమలా నాయన కిరణాలను
నిమిషమైనా అందించనీ జీవితాన్ని
ఆస్వాదించి చేరుకోని సుప్తావస్థని
నువ్వు లేని సంవత్సరం, క్షణం కానివ్వు దాన్ని
నువ్వు లేని జీవితం, దినం కానివ్వు దాన్ని
ఎన్ని కోట్ల జన్మలైనా ఎత్తని
గడియ పొందనివ్వు నీ స్నేహాన్ని...
వస్తువు : రచయిత పెరిగిన ఊరు నల్లగొండ. రచయిత బాల్యంలో జరిగిన సంఘటనలే దీంట్లో కథా వస్తువులు. కళ మన జీవితంలోని వివిధ భావాల గురించిన కథలు మనకు చెప్తుంది. అది సినిమా అయినా, పుస్తకం అయినా. జీవితంలోని కొన్ని కథలల్లో నాటకీయత ఉండకపోవచ్చు, ఉత్కంఠ ఉండకపోవచ్చు, సర్వ శక్తులు ఉండి పురాణ కథల పాత్రలను తలపించే పాత్రలు ఉండకపోవచ్చు . అది ఆడుకోడానికి సెలవుల కోసం ఎదురు చూసే చిన్న పిల్లాడి కథ కావచ్చు , రోజూ గంభీరంగా ఉండే నాన్న మనసు ఎంత సున్నితమో చెప్పే కథ కావచ్చు , చిన్నతనంలో స్నేహితులతో కలిసి చేసిన అల్లరి కథ కావచ్చు, ఊరు ఎంత అభివృద్ధి చెందినా చిన్నప్పటి పరిసరాలు లేవే అని ఫీల్ అయ్యే నోస్టాల్జియా గురించిన కథ కావచ్చు. వీటి అన్నింటిలో లోతైన, సున్నితమైన మనిషి స్వభావపు కోణాలు ఉంటాయి. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సమయంలో లోనైన ఉద్వేగాలు ఉంటాయి. మానవ సంబంధాల గురించిన ఆ...
Comments
Post a Comment