బుచ్చిబాబు ఉండేది ఆదిలాబాద్ నగరంలో. బుచ్చిబాబు ఐదున్నర అడుగులు ఉంటాడు. ఛామన ఛాయ, వతైన జుట్టు. ఏడు సంవత్సరాల నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా పని చేస్తున్నాడు. ఆఫీసుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఇల్లు. వారంలో ఆరు రోజులు ఇంటి నుంచి ఆఫీసుకి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లడం, ఆదివారం అయితే విశ్రాంతి తీసుకోవడం అతని దినచర్య. కొత్త ప్రదేశాలకు వెళ్లడం చాలా తక్కువ. రోజు ఇంటికి వెళ్లే ముందు స్నేహితులతో కాంటీన్లో టీ తాగడం అలవాటు . ఈ రోజు కూడా ముగ్గురు స్నేహితులతో పాటు కాంటీన్ కి వచ్చాడు. వారితో పాటు సుబ్బయ్య కూడా వచ్చాడు . సుబ్బయ్య, బుచ్చిబాబు ఒక్కప్పుడు ప్రాణ స్నేహితులు. కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటది. వీళ్ళ గొడవకు కారణం ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆఫీసులో ప్రొమోషన్ల కోసం తహసీల్దార్ రివ్యూ చేస్తున్నాడు. బుచ్చిబాబు, సుబ్బయ్య ఇద్దరూ అర్హులే. కానీ బుచ్చిబాబుకి సుబ్బయ్య కంటే ఒక సంవత్సరం అనుభవం తక్కువ ఉండడం వల్ల తహసీల్దారు తన విచక్షణాధికారం వాడి ఒక సంవత్సరం ఆలస్యం చేయొచ్చు. ఆలా చేయకుండా వుండాలంటే లక్ష రుపాయలు లంచం అడిగాడు. సుబ్బయ్య బుచ్చిబాబుకి ధైర్యం చెప్పి తా...