వస్తువు : రచయిత పెరిగిన ఊరు నల్లగొండ. రచయిత బాల్యంలో జరిగిన సంఘటనలే దీంట్లో కథా వస్తువులు. కళ మన జీవితంలోని వివిధ భావాల గురించిన కథలు మనకు చెప్తుంది. అది సినిమా అయినా, పుస్తకం అయినా. జీవితంలోని కొన్ని కథలల్లో నాటకీయత ఉండకపోవచ్చు, ఉత్కంఠ ఉండకపోవచ్చు, సర్వ శక్తులు ఉండి పురాణ కథల పాత్రలను తలపించే పాత్రలు ఉండకపోవచ్చు . అది ఆడుకోడానికి సెలవుల కోసం ఎదురు చూసే చిన్న పిల్లాడి కథ కావచ్చు , రోజూ గంభీరంగా ఉండే నాన్న మనసు ఎంత సున్నితమో చెప్పే కథ కావచ్చు , చిన్నతనంలో స్నేహితులతో కలిసి చేసిన అల్లరి కథ కావచ్చు, ఊరు ఎంత అభివృద్ధి చెందినా చిన్నప్పటి పరిసరాలు లేవే అని ఫీల్ అయ్యే నోస్టాల్జియా గురించిన కథ కావచ్చు. వీటి అన్నింటిలో లోతైన, సున్నితమైన మనిషి స్వభావపు కోణాలు ఉంటాయి. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సమయంలో లోనైన ఉద్వేగాలు ఉంటాయి. మానవ సంబంధాల గురించిన ఆ...