సర్వం క్షణికం అయినప్పుడు సంతోషం ఎందుకో
అన్నీ తాత్కాలికం అయినప్పుడు ఆశ ఎందుకో
బాధ అనే సంద్రంలో కలిసే కోరకు ఉరకల ప్రేమ ధార ఎందుకో
తాకలేని తీరాన్ని చూపి కాల్చే జ్ఞాపకాల జ్వాలెందుకు?
బాధ్యతల సంకెళ్లు తొడిగే బంధాల వెంపర్లాట ఎందుకో
స్వేచ్చకు సమాధి కట్టే నాగరికతా మేడలు ఎందుకో
జీవితానికి అర్ధం ఇవ్వలేని వాటి కోసం ప్రయాస ఎందుకో
మనసుకి అర్ధం అవ్వని వాటి కోసం మధనం ఎందుకో
విస్తృత విశాల విశ్వంలో అణువంత ఉన్న నీ ఊహా ప్రపంచం కోసం ఆవేశం ఎందుకు?
సృష్టి కాలమానంలో నీ చిటికెడు జీవితానికి దర్పం ఎందుకో
I like the way how humans inability to comprehend what they want, why they want, even if they get it, could it be it, the temporary sensual pleasures satisfaction which never gives contentment. A poem to cherish, a guide to explain the modern day anxiety. Well written, absolutely loved it.
ReplyDelete