జీవిత గమనం ముందుకుండగా
గతానికి మనపై పట్టెందుకు?
వదిలిన చీకటి చూపునాపగలదా?
మరి గడిచిన దుఃఖం దృష్టినాపుతుందెందుకు?
వెలిసిన వాన నేల తడుపుతుందా?
మరి మునుపటి విషయం కళ్లు తడుపుతుందెందుకు?
దాటిన ముళ్లు కాలు గుచ్చుతుందా?
ఏండ్ల నాటి మాట మనసు గుచ్చునెందుకు?
తీరిన ఆకలి కడుపు కాల్చుతుందా?
జరిగిన మోసం గుండె కాల్చుతుందెందుకు?
మనసు మోయలేని బరువెత్తును ఎందుకు?
మనం వర్తమానంలో ఉంటే
ఆలోచనకి గతానిపై మోహమెందుకు?
జ్ఞాపకాలకి కాలాన్ని మించిన ఆయుష్షు ఎందుకు?
Comments
Post a Comment