Skip to main content

Posts

Showing posts from June, 2020

[Telugu Poem] ఓ కవితా!

ఓ కవితా ఎన్ని పదాలు వాడినా ఎన్ని ఉపమానాలు చూపినా నీ గొప్పను చెప్పుట అసంపూర్ణం ప్రపంచ అందాలన్నీ కలిసినా, పోటీలో నీ గెలుపు ఏకగ్రీవం నీ అసాధారణ సామర్ధ్యాన్ని తెలిసినంతలో చెప్పుటకు ఈ చిన్ని ప్రయత్నం అడుగడుగునా అపాయాన్ని నింపుకున్న ప్రపంచంలో జీవిత కాల తోడులా హాయినీ , క్షేమాన్ని ఇచ్చే సమయంలో తండ్రివై నన్ను కవ్వించి, ఊరించి నీ దరికి రప్పించి నా చేతుల్లో అందంగా ఒదిగే వేళ ప్రేయసివై ఆలోచనా గన్నుల్లో అతి కష్టం మీద దొరికి మెరిసేటప్పుడు బంగారానివై లోతైన భావాలను శక్తివంతంగా శ్రోతకు చేర్చే ధీటైన వజ్రనివై నా భావాలను నలుగురికి చేర్చే మాంత్రిక మాధ్యమానివై చిన్నగా నా జీవితంలోకి వచ్చిన నువ్వు చినుకువై వర్షానివై వరదవై జీవనదివై తళుకువై మెరుపువై అతి సమీప తారవై పలుకువై పదానివై పద్యానివై పరమార్ధానివై నిప్పురవ్వవై మంటవై ప్రళయకాలాగ్నివై పిల్ల గాలివై ఈదురు గాలివై పెను తుఫానువై కళవై కలవై చిరకాల కలిమివై అలవాటువై వ్యసనానివై ఇష్టకష్టానివై మిగిలావు 

[Telugu Poem] జీవితం, అలుపెరుగని ప్రయాణం

అడుగులు వినపడక అస్సలు కనపడక ఒక్కసారిగా తగిలి టప్పుకున  పట్టెను ఖేదం ఆశలు, కలలు, ఆనందాలు చీకటి చెరసాలలో బందీ అయిన ఆ క్షణం రంగులు మారెను జీవితం అసలు రంగులు చూపిరి చుట్టూ ఉన్న జనం అడుగు - వేయలేని దూరం కేశములు - మోయలేని భారం ఆసక్తి, కాంక్ష శూన్యం శరీరం ఒక జీవత్సవం అయినా ఆగదు హృదయం, పోదు ప్రాణం తళ్ళుక్కుమని మెరిసెను చిన్ని సంకల్పం జీవితం కాదు బృందావనం, ఇది అరణ్యం   ఆశపడే పూల మార్గం ఊహాజనితం అడవిలో ముళ్ల బాటలే సహజం బాటసారికి కొన్నిసార్లు చిందక తప్పదు రక్తం చీకట్లో  మిణుగురు అయినా రాత్రిపూట జాబిల్లి అయినా గర్జించే మెరుపైనా కరిగే కాగడా అయినా నిశీథిని చీల్చే ఏ చిన్న ఉపాయం అయినా భయాన్ని, బాధని పక్కకు నెట్టి దాని చేయి పట్టి రక్తానికి పసుపు పెట్టి , గాయానికి కట్టు కట్టి జాగ్రత్తగా ముందుకు కదిలెను పాదం ఇదే మానవ జీవన పరిణామ క్రమం 

[Telugu Poem] - ప్రకృతి రాయబారం

అమావాస్య నుండి  దినదినాభివృద్ధి చెంది పూర్ణిమ ఆకాశంలో మెరిసింది చిన్న పాయలు నదులుగా మారి ఉరకలెత్తాయి పక్షులు సొంత గూటికి చేరాలనే కాంక్షతో పరుగులెత్తాయి నీ పైన అనురాగం పూర్ణబింబమై మెరిసింది నీ గొంతు విని మనసు ఉరకలెత్తినది అది నీకు చెప్పాలనే ఆలోచన రెక్కలు తొడిగింది లక్ష మాటలను మోసిన గొంతు రెండు అక్షరాలను మోయలేనంది కోటి శబ్దాలను చేసిన నాలిక రెండు గణాలను పలకలేనని మొండికేసింది మనిషి భాష పలికినవి మనసు భాష భారమన్నవి సహజ మార్గాలు కరువైన చోట ప్రకృతి విన్నపమే ఉపాయమైనది చెలి ముంగురులు తాకి పలకరించు వేళ ఓ గాలీ! చెవిన చేరి నా మాట చేర్చలేవా? తన అడుగులతో సంగీతం పలికించు వేళ ఓ భూమీ! నా మనసు పాట వినిపించలేవా? దీపారాధనతో నీకు ప్రాణం పొసే వేళ ఓ అగ్ని! కాస్త గర్జించి నా గాథ చెప్పలేవా? సఖి కలువ కన్నులలో నిన్ను దాచుకున్న వేళ ఓ ఆకాశమా! మేఘాల కాగితాల పై నా ప్రేమ లేఖలు పంపలేవా? విసుగెత్తి వేసారి విస్తుపోయి వింత విన్నపాలతో వేధించిన నన్ను ప్రేయసి దరి చేరితే ఏం చేస్తావు అని ప్రశ్న విసిరింది ప్రకృతి ఆమె నీడ దొరికితే గుడి కడతామని అన్నాయి నా చూపులు ఆమె చేరితే ఊపిరి తీసుకుంటామని చెప్పాయి నా శ్వాసలు

[Book Review] I am Malala by Malala Yousafzai, Christina Lamb

                                                 Malala is a girl who needs no introduction. She has created quite a sensation when she has bagged Nobel Peace prize at the age of 17 in 2014. I wanted to read about education and understand its several dimensions. That is the reason I have picked up this book and I am not disappointed. What is this book about? It is biography of Malala, detailing her life till 2013. It describes events in Swat valley, which is considered as Switzerland of East. Situation in the region and their effects on Malala's life, along with other people in the region are described in the book.     We learn about political situation in Pakistan and role of various actors including Taliban, military and political parties in it. Social and cultural life of the region is also talked about though it not the ...