అమావాస్య నుండి దినదినాభివృద్ధి చెంది పూర్ణిమ ఆకాశంలో మెరిసింది
చిన్న పాయలు నదులుగా మారి ఉరకలెత్తాయి
పక్షులు సొంత గూటికి చేరాలనే కాంక్షతో పరుగులెత్తాయి
నీ పైన అనురాగం పూర్ణబింబమై మెరిసింది
నీ గొంతు విని మనసు ఉరకలెత్తినది
అది నీకు చెప్పాలనే ఆలోచన రెక్కలు తొడిగింది
లక్ష మాటలను మోసిన గొంతు
రెండు అక్షరాలను మోయలేనంది
కోటి శబ్దాలను చేసిన నాలిక
రెండు గణాలను పలకలేనని మొండికేసింది
మనిషి భాష పలికినవి
మనసు భాష భారమన్నవి
సహజ మార్గాలు కరువైన చోట
ప్రకృతి విన్నపమే ఉపాయమైనది
చెలి ముంగురులు తాకి పలకరించు వేళ ఓ గాలీ!
చెవిన చేరి నా మాట చేర్చలేవా?
తన అడుగులతో సంగీతం పలికించు వేళ ఓ భూమీ!
నా మనసు పాట వినిపించలేవా?
దీపారాధనతో నీకు ప్రాణం పొసే వేళ ఓ అగ్ని!
కాస్త గర్జించి నా గాథ చెప్పలేవా?
సఖి కలువ కన్నులలో నిన్ను దాచుకున్న వేళ ఓ ఆకాశమా!
మేఘాల కాగితాల పై నా ప్రేమ లేఖలు పంపలేవా?
విసుగెత్తి వేసారి విస్తుపోయి
వింత విన్నపాలతో వేధించిన నన్ను
ప్రేయసి దరి చేరితే ఏం చేస్తావు
అని ప్రశ్న విసిరింది ప్రకృతి
ఆమె నీడ దొరికితే గుడి కడతామని
అన్నాయి నా చూపులు
ఆమె చేరితే ఊపిరి తీసుకుంటామని
చెప్పాయి నా శ్వాసలు
పక్షులు సొంత గూటికి చేరాలనే కాంక్షతో పరుగులెత్తాయి
నీ పైన అనురాగం పూర్ణబింబమై మెరిసింది
నీ గొంతు విని మనసు ఉరకలెత్తినది
అది నీకు చెప్పాలనే ఆలోచన రెక్కలు తొడిగింది
లక్ష మాటలను మోసిన గొంతు
రెండు అక్షరాలను మోయలేనంది
కోటి శబ్దాలను చేసిన నాలిక
రెండు గణాలను పలకలేనని మొండికేసింది
మనిషి భాష పలికినవి
మనసు భాష భారమన్నవి
సహజ మార్గాలు కరువైన చోట
ప్రకృతి విన్నపమే ఉపాయమైనది
చెలి ముంగురులు తాకి పలకరించు వేళ ఓ గాలీ!
చెవిన చేరి నా మాట చేర్చలేవా?
తన అడుగులతో సంగీతం పలికించు వేళ ఓ భూమీ!
నా మనసు పాట వినిపించలేవా?
దీపారాధనతో నీకు ప్రాణం పొసే వేళ ఓ అగ్ని!
కాస్త గర్జించి నా గాథ చెప్పలేవా?
సఖి కలువ కన్నులలో నిన్ను దాచుకున్న వేళ ఓ ఆకాశమా!
మేఘాల కాగితాల పై నా ప్రేమ లేఖలు పంపలేవా?
విసుగెత్తి వేసారి విస్తుపోయి
వింత విన్నపాలతో వేధించిన నన్ను
ప్రేయసి దరి చేరితే ఏం చేస్తావు
అని ప్రశ్న విసిరింది ప్రకృతి
ఆమె నీడ దొరికితే గుడి కడతామని
అన్నాయి నా చూపులు
ఆమె చేరితే ఊపిరి తీసుకుంటామని
చెప్పాయి నా శ్వాసలు
Comments
Post a Comment