అడుగులు వినపడక
అస్సలు కనపడక
ఒక్కసారిగా తగిలి టప్పుకున పట్టెను ఖేదం
ఆశలు, కలలు, ఆనందాలు
చీకటి చెరసాలలో బందీ అయిన ఆ క్షణం
రంగులు మారెను జీవితం
అసలు రంగులు చూపిరి చుట్టూ ఉన్న జనం
అడుగు - వేయలేని దూరం
కేశములు - మోయలేని భారం
ఆసక్తి, కాంక్ష శూన్యం
శరీరం ఒక జీవత్సవం
అయినా ఆగదు హృదయం, పోదు ప్రాణం
తళ్ళుక్కుమని మెరిసెను చిన్ని సంకల్పం
జీవితం కాదు బృందావనం, ఇది అరణ్యం
ఆశపడే పూల మార్గం ఊహాజనితం
అడవిలో ముళ్ల బాటలే సహజం
బాటసారికి కొన్నిసార్లు చిందక తప్పదు రక్తం
చీకట్లో మిణుగురు అయినా
రాత్రిపూట జాబిల్లి అయినా
గర్జించే మెరుపైనా
కరిగే కాగడా అయినా
నిశీథిని చీల్చే ఏ చిన్న ఉపాయం అయినా
భయాన్ని, బాధని పక్కకు నెట్టి
దాని చేయి పట్టి
రక్తానికి పసుపు పెట్టి , గాయానికి కట్టు కట్టి
జాగ్రత్తగా ముందుకు కదిలెను పాదం
ఇదే మానవ జీవన పరిణామ క్రమం
అస్సలు కనపడక
ఒక్కసారిగా తగిలి టప్పుకున పట్టెను ఖేదం
ఆశలు, కలలు, ఆనందాలు
చీకటి చెరసాలలో బందీ అయిన ఆ క్షణం
రంగులు మారెను జీవితం
అసలు రంగులు చూపిరి చుట్టూ ఉన్న జనం
అడుగు - వేయలేని దూరం
కేశములు - మోయలేని భారం
ఆసక్తి, కాంక్ష శూన్యం
శరీరం ఒక జీవత్సవం
అయినా ఆగదు హృదయం, పోదు ప్రాణం
తళ్ళుక్కుమని మెరిసెను చిన్ని సంకల్పం
జీవితం కాదు బృందావనం, ఇది అరణ్యం
ఆశపడే పూల మార్గం ఊహాజనితం
అడవిలో ముళ్ల బాటలే సహజం
బాటసారికి కొన్నిసార్లు చిందక తప్పదు రక్తం
చీకట్లో మిణుగురు అయినా
రాత్రిపూట జాబిల్లి అయినా
గర్జించే మెరుపైనా
కరిగే కాగడా అయినా
నిశీథిని చీల్చే ఏ చిన్న ఉపాయం అయినా
భయాన్ని, బాధని పక్కకు నెట్టి
దాని చేయి పట్టి
రక్తానికి పసుపు పెట్టి , గాయానికి కట్టు కట్టి
జాగ్రత్తగా ముందుకు కదిలెను పాదం
ఇదే మానవ జీవన పరిణామ క్రమం
Comments
Post a Comment