ఓ కవితా
ఎన్ని పదాలు వాడినా ఎన్ని ఉపమానాలు చూపినా నీ గొప్పను చెప్పుట అసంపూర్ణం
ప్రపంచ అందాలన్నీ కలిసినా, పోటీలో నీ గెలుపు ఏకగ్రీవం
నీ అసాధారణ సామర్ధ్యాన్ని తెలిసినంతలో చెప్పుటకు ఈ చిన్ని ప్రయత్నం
అడుగడుగునా అపాయాన్ని నింపుకున్న ప్రపంచంలో జీవిత కాల తోడులా హాయినీ , క్షేమాన్ని ఇచ్చే సమయంలో తండ్రివై
నన్ను కవ్వించి, ఊరించి నీ దరికి రప్పించి నా చేతుల్లో అందంగా ఒదిగే వేళ ప్రేయసివై
ఆలోచనా గన్నుల్లో అతి కష్టం మీద దొరికి మెరిసేటప్పుడు బంగారానివై
లోతైన భావాలను శక్తివంతంగా శ్రోతకు చేర్చే ధీటైన వజ్రనివై
నా భావాలను నలుగురికి చేర్చే మాంత్రిక మాధ్యమానివై
చిన్నగా నా జీవితంలోకి వచ్చిన నువ్వు
చినుకువై వర్షానివై వరదవై జీవనదివై
తళుకువై మెరుపువై అతి సమీప తారవై
పలుకువై పదానివై పద్యానివై పరమార్ధానివై
నిప్పురవ్వవై మంటవై ప్రళయకాలాగ్నివై
పిల్ల గాలివై ఈదురు గాలివై పెను తుఫానువై
కళవై కలవై చిరకాల కలిమివై
అలవాటువై వ్యసనానివై
ఇష్టకష్టానివై మిగిలావు

Comments
Post a Comment