గుండె కొట్టుకుంటూనే ఉంది
కన్ను తెరిసిన క్షణం నుంచి
కాలే చివరి కణం వరకు
ఇంటినే ప్రపంచంగా తలచి
అమ్మ ఒడిలో ప్రపంచాన్నే మరచి
ఆడే బాల్యం నుంచి
గుండె కొట్టుకుంటూనే ఉంది
నడక నేర్వాలనే ఆరాటం
నలుగురితో ఆడాలనే కుతూహలం
మంచి అనిపించుకోవాలనే ఆత్రం
బాల్యం దాటి కౌమార దశలో
గుండె కొట్టుకుంటూనే ఉంది
మంచి కాలేజీలో సీటు కోసం
చక్కని భవిష్యత్తుకు భరోసా కోసం
అమ్మానాన్నల కష్టానికి ఫలితం కోసం
ప్రపంచాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కోసం
పడకుండా కాళ్ళ పై నిలబడ గలిగే శక్తి కోసం
యవ్వనానికి వచ్చినప్పుడు కూడా గుండె కొట్టుకుంటూనే ఉంది
చదువుకు తగ్గ పని కోసం
నలుగురిలో హోదా కోసం
బ్రతక గలిగే బడ్జెట్ కోసం
నాకంటూ ఉన్న ఆత్మగౌరవం కోసం
కన్నీటిని తుడిచే, తుడుచుకుని చూడ గలిగే ఆత్మస్తైర్యం కోసం
ఒక్కసారిగా తుఫానులా పరిచయం అయిన ప్రపంచపు ప్రశ్నలకు జవాబు కోసం
ఏళ్ళు గడిచాయి
తీరులు మారాయి దారులు మారాయి
ఘన విజయాలు, గుండెను పిండే ఘోరాలు జరిగాయి
గమ్యాలు మారుతూ ఉన్నాయి
వయస్సు, డబ్బు, ఆనందం, అందం, జీవితం అన్ని అర్థాలు మారాయి
గుండె కొట్టుకుంటూనే ఉంది
ప్రేమను పంచే మనస్సు కోసం
కలిసి నవ్వే నలుగురి కోసం
కంటి నిండా నిద్ర కోసం
కడుపు నిండా తిండి కోసం
కనిపించని కలల కోసం
పలకరించని పిలుపు కోసం
తిరిగి రాని క్షణాల కోసం
మరువ లేని జ్ఞాపకాల కోసం
అడుగులలో సంయమనం కోసం
పోటీ నుండి ఉపశమనం కోసం
చేరలేని గమ్యాల కోసం
తరగని దూరాల కోసం
ఆశగా చూసే రేపటి కోసం
హాయిగా నవ్వే ఆ క్షణం కోసం
గుండె కొట్టుకుంటూనే ఉంది
అది ఎప్పుడు ఆగింది కనుక?
కన్ను తెరిసిన క్షణం నుంచి
కాలే చివరి కణం వరకు
ఇంటినే ప్రపంచంగా తలచి
అమ్మ ఒడిలో ప్రపంచాన్నే మరచి
ఆడే బాల్యం నుంచి
గుండె కొట్టుకుంటూనే ఉంది
నడక నేర్వాలనే ఆరాటం
నలుగురితో ఆడాలనే కుతూహలం
మంచి అనిపించుకోవాలనే ఆత్రం
బాల్యం దాటి కౌమార దశలో
గుండె కొట్టుకుంటూనే ఉంది
మంచి కాలేజీలో సీటు కోసం
చక్కని భవిష్యత్తుకు భరోసా కోసం
అమ్మానాన్నల కష్టానికి ఫలితం కోసం
ప్రపంచాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కోసం
పడకుండా కాళ్ళ పై నిలబడ గలిగే శక్తి కోసం
యవ్వనానికి వచ్చినప్పుడు కూడా గుండె కొట్టుకుంటూనే ఉంది
చదువుకు తగ్గ పని కోసం
నలుగురిలో హోదా కోసం
బ్రతక గలిగే బడ్జెట్ కోసం
నాకంటూ ఉన్న ఆత్మగౌరవం కోసం
కన్నీటిని తుడిచే, తుడుచుకుని చూడ గలిగే ఆత్మస్తైర్యం కోసం
ఒక్కసారిగా తుఫానులా పరిచయం అయిన ప్రపంచపు ప్రశ్నలకు జవాబు కోసం
ఏళ్ళు గడిచాయి
తీరులు మారాయి దారులు మారాయి
ఘన విజయాలు, గుండెను పిండే ఘోరాలు జరిగాయి
గమ్యాలు మారుతూ ఉన్నాయి
వయస్సు, డబ్బు, ఆనందం, అందం, జీవితం అన్ని అర్థాలు మారాయి
గుండె కొట్టుకుంటూనే ఉంది
ప్రేమను పంచే మనస్సు కోసం
కలిసి నవ్వే నలుగురి కోసం
కంటి నిండా నిద్ర కోసం
కడుపు నిండా తిండి కోసం
కనిపించని కలల కోసం
పలకరించని పిలుపు కోసం
తిరిగి రాని క్షణాల కోసం
మరువ లేని జ్ఞాపకాల కోసం
అడుగులలో సంయమనం కోసం
పోటీ నుండి ఉపశమనం కోసం
చేరలేని గమ్యాల కోసం
తరగని దూరాల కోసం
ఆశగా చూసే రేపటి కోసం
హాయిగా నవ్వే ఆ క్షణం కోసం
గుండె కొట్టుకుంటూనే ఉంది
అది ఎప్పుడు ఆగింది కనుక?
Comments
Post a Comment