ఏమి కావాలో మనసుతో చూడలేని వాళ్ళు
ఏమి చేయాలో కళ్ళతో ఆలోచిస్తారు
ఆకాశంలో విమానంలో విహరించినప్పుడు రాని భావన
నేలపై చుక్కలు పొదిగిన ఆకాశం చుస్తే వచ్చింది కదా
పట్టు వస్త్రాలతో ఊరేగినప్పుడు రాని ఆనందం
అమ్మ పాత చీర కొంగు పట్టుకుని నడిస్తే వచ్చింది కదా
ఏసీలో ఉన్నా చల్లబడని మనసు
ఏరా అని మిత్రుడు పిలిస్తే కుదుట పడింది కదా
భౌతిక జగత్తును మించిన భావన కోణం ఉంది జగతికి
అది అర్ధం చేసుకున్నప్పుడే పరమార్ధం ప్రగతికి

Comments
Post a Comment