Skip to main content

Posts

Showing posts from April, 2020

[Telugu Poem] ప్రగతి

ఏమి కావాలో మనసుతో చూడలేని వాళ్ళు ఏమి చేయాలో కళ్ళతో ఆలోచిస్తారు ఆకాశంలో విమానంలో విహరించినప్పుడు రాని భావన నేలపై చుక్కలు పొదిగిన ఆకాశం చుస్తే వచ్చింది కదా పట్టు వస్త్రాలతో ఊరేగినప్పుడు రాని ఆనందం అమ్మ పాత చీర కొంగు పట్టుకుని నడిస్తే వచ్చింది కదా ఏసీలో ఉన్నా చల్లబడని మనసు ఏరా అని మిత్రుడు పిలిస్తే కుదుట పడింది కదా భౌతిక జగత్తును మించిన భావన కోణం ఉంది జగతికి అది అర్ధం చేసుకున్నప్పుడే పరమార్ధం ప్రగతికి

[Telugu Poem] జీవితం - నిరంతర ఆరాటం

గుండె కొట్టుకుంటూనే ఉంది కన్ను తెరిసిన క్షణం నుంచి కాలే చివరి కణం వరకు ఇంటినే ప్రపంచంగా తలచి అమ్మ ఒడిలో ప్రపంచాన్నే మరచి ఆడే బాల్యం నుంచి గుండె కొట్టుకుంటూనే ఉంది నడక నేర్వాలనే ఆరాటం నలుగురితో ఆడాలనే కుతూహలం మంచి అనిపించుకోవాలనే ఆత్రం బాల్యం దాటి కౌమార దశలో గుండె కొట్టుకుంటూనే ఉంది మంచి కాలేజీలో సీటు కోసం చక్కని భవిష్యత్తుకు భరోసా కోసం అమ్మానాన్నల కష్టానికి ఫలితం కోసం ప్రపంచాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కోసం పడకుండా కాళ్ళ పై నిలబడ గలిగే శక్తి కోసం యవ్వనానికి వచ్చినప్పుడు కూడా గుండె కొట్టుకుంటూనే ఉంది చదువుకు తగ్గ పని కోసం నలుగురిలో హోదా కోసం బ్రతక గలిగే బడ్జెట్ కోసం నాకంటూ ఉన్న ఆత్మగౌరవం కోసం కన్నీటిని తుడిచే, తుడుచుకుని చూడ గలిగే ఆత్మస్తైర్యం కోసం ఒక్కసారిగా తుఫానులా పరిచయం అయిన ప్రపంచపు ప్రశ్నలకు జవాబు కోసం ఏళ్ళు గడిచాయి తీరులు మారాయి దారులు మారాయి ఘన విజయాలు, గుండెను పిండే ఘోరాలు జరిగాయి గమ్యాలు మారుతూ ఉన్నాయి వయస్సు, డబ్బు, ఆనందం, అందం, జీవితం అన్ని అర్థాలు మారాయి గుండె కొట్టుకుంటూనే ఉంది ప్రేమను పంచే మనస్సు కోసం కలిసి నవ్వే నలుగురి కోసం కంటి నిండా నిద్ర ...

[Telugu Poem] ఒక్క క్షణం

ఒక్క  నిమిషం వర్షం నదులు ముంచినట్టు ఒక్క  చిన్న పువ్వు గది మొత్తం సుగంధాలు నింపినట్టు ఒక్క  నవ్వు బాధలన్నీ పోగొట్టినట్టు ఒక్క  అడుగు గమ్యాన్ని చేర్చినట్టు కొన్ని క్షణాల నీ పరిచయం కొన్ని రోజుల నీ జ్ఞాపకం అలవాటులా.. వ్యసనంలా... నాకే నేను దూరమయ్యి నాలో నువ్వు భాగమయ్యి నా జీవితాన్ని నింపేస్తున్నవి నా ఆలోచనలని ముంచేస్తున్నవి

[English Poem] Life worth living

Fortune maybe inherited by luck Money may be earned by any kind of means Gifts may be received by chance of being in the right place Love can be received passively not realizing its beauty Places can be traveled without involving heart and mind Respect can be commanded by making people fear you But a life worth its name can be lived only     by doing things that make us feel invincible     by enduring struggles that make us feel livelier than ever     by feeling the sense of universal soul that resides in each living being     by making moments that make you forget about the past and future, and when they become memories make you forget the present     by comprehending beauty of this universe and trying to recreate a part of it     by living moments that skip you a hearbteat and take out your breath     by making friends who make your joy multiply and tears hide

[Telugu Poem] నీ స్థానం వర్ణనలకు అతీతం

నిన్ను మొదటిసారి చూసినప్పుడు కలిగిందేంటి? ప్రేమా? ఆకర్షణా? మైమరుపా? దాని పేరేంటి? తెలుసుకోగల మార్గమేంటి? చినుకు తాకిన మట్టి సుగంధానికి కారణమేంటి? చినుకా? మట్టా? అవి కలిసిన పరవశమా? ఎండిపోతున్న గొంతును తాకిన నీటి రుచేంటి? తియ్యనా? కమ్మనా? ఇంకా ఏదోనా? ఇంద్రధనస్సు అందానికి మూలం ఏంటి? ఎండా? వర్షమా? వాటి విరహ వేదనా? అమ్మ ప్రేమకు నాన్న ఇష్టానికి వర్ణన ఏంటి? ఉందా ? ఉన్నా  భాషకు అందుతుందా ? సంగీతం ప్రాణం ఎలా తడుతుంది? సాహిత్యం ప్రాణం ఎలా పోస్తుంది ? నవ్వు భారం ఎలా తగ్గిస్తుంది ? ఒక తోడు ప్రపంచాన్ని అందంగా ఎలా మారుస్తుంది ? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు  అవసరం కాని వీటికి ప్రశ్నలే సర్వస్వము నా జీవితంలో నీ పాత్రేంటి? నన్ను పడేసిన ఆటంకానివా ? ఉరకాలి అనిపించిన ఆశవా? నేను నేర్చుకున్న గుణపాఠానివా ? నాకు మిగిల్చిన జ్ఞాపకానివా ? నవ్వులను దూరం చేసిన రాక్షసివా ? ఊహలకు ఊపిరి పోసిన దేవతావా ? మరపు రాని గాయనివా ? మరువలేని మధుర స్వప్నానివా ? వెలుగు పంచే చందమామవా? చుట్టూ ఉన్న చీకటివా? దాహం తీర్చే నీటి బిందువా? ముంచే వరదవా? అందమైన రూపానివా? అందని తీరానివా? కోరుకున్న...

[Telugu Poem] మనిషీ!

చాలా మందికి నేను ఒక ఆకారం మాత్రమే చాలా మందికి నేను ఒక బ్యాంకు బ్యాలెన్సు మాత్రమే చాలా మందికి నేను ఒక ఉద్యోగం మాత్రమే చాలా మందికి నేను ఒక హోదా మాత్రమే ఇటువంటి సంకుచిత ప్రపంచంలో గందరగోళ వ్యవస్థలో అర్థం లేని హడావిడిలో కళ్ళను దాటి కన్నీళ్ళను మాటను దాటి మనసును చూడగలిగిన మనిషీ నీకు నా జోహార్లు

[Telugu Poem] నీ సహచర్యం

ఏమని చెప్పను? ఇంత భావం అయితే మాట్టల్లో చెప్పొచ్చు అంత అనుభూతి ఎలా చెప్పను? కొంత ఆనందం అయితే ఎలాగైనా చెప్పొచ్చు అంత పరవశం ఎలా చెప్పను? నీ నిలకడ ఉక్కిరిబిక్కిరి అవుతున్న మనసుకి ప్రశాంతం నీ సహచర్యం నిద్రపోతున్న మనసుకి చలనం నీ స్నేహం ఒంటరి మనసుకి కోరని వరం నీ నుంచి కొన్ని రోజులైనా కొన్ని అడుగులైనా అది నేను భరించలేని దూరం,భారం