నిన్ను మొదటిసారి చూసినప్పుడు కలిగిందేంటి?
ప్రేమా? ఆకర్షణా? మైమరుపా? దాని పేరేంటి?
తెలుసుకోగల మార్గమేంటి?
చినుకు తాకిన మట్టి సుగంధానికి కారణమేంటి?
చినుకా? మట్టా? అవి కలిసిన పరవశమా?
ఎండిపోతున్న గొంతును తాకిన నీటి రుచేంటి?
తియ్యనా? కమ్మనా? ఇంకా ఏదోనా?
ఇంద్రధనస్సు అందానికి మూలం ఏంటి?
ఎండా? వర్షమా? వాటి విరహ వేదనా?
అమ్మ ప్రేమకు నాన్న ఇష్టానికి వర్ణన ఏంటి?
ఉందా ? ఉన్నా భాషకు అందుతుందా ?
సంగీతం ప్రాణం ఎలా తడుతుంది?
సాహిత్యం ప్రాణం ఎలా పోస్తుంది ?
నవ్వు భారం ఎలా తగ్గిస్తుంది ?
ఒక తోడు ప్రపంచాన్ని అందంగా ఎలా మారుస్తుంది ?
కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అవసరం
కాని వీటికి ప్రశ్నలే సర్వస్వము
నా జీవితంలో నీ పాత్రేంటి?
నన్ను పడేసిన ఆటంకానివా ?
ఉరకాలి అనిపించిన ఆశవా?
నేను నేర్చుకున్న గుణపాఠానివా ?
నాకు మిగిల్చిన జ్ఞాపకానివా ?
నవ్వులను దూరం చేసిన రాక్షసివా ?
ఊహలకు ఊపిరి పోసిన దేవతావా ?
మరపు రాని గాయనివా ?
మరువలేని మధుర స్వప్నానివా ?
వెలుగు పంచే చందమామవా? చుట్టూ ఉన్న చీకటివా?
దాహం తీర్చే నీటి బిందువా? ముంచే వరదవా?
అందమైన రూపానివా? అందని తీరానివా?
కోరుకున్న వరానివా? వదిలిన శాపానివా?
నువ్వేంటో అర్ధమయ్యే వీలుందా ?
ఉన్నా నా మనసుకు అందుతుందా ?
నీ గురించి ప్రశ్నలకు సమాధానంగా పదాలు చాలవు
నీ స్నేహపు అసాధారణ శక్తికి హద్దులు లేవు
నిన్ను చూసినప్పుడే చచ్చాను , అప్పుడే బ్రతికాను
గుండె అప్పుడే ఆడింది, శ్వాస అప్పుడే ఆగింది
జీవితం హింసించినా భరించాను
నువ్వు నవ్వితే లొంగి పోయాను
నువ్వు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి పొంగాను
నువ్వున్న దూరాలు గుర్తుకు వచ్చి ప్రాప్తం లేదనుకున్నాను
చేతబడి చేసిన దయ్యానివా?
మంత్రం వేసిన మంత్రసానివా?
నువ్వు ప్రేమా? ఆకర్షణా? మైమరుపా?
ప్రేమా? ఆకర్షణా? మైమరుపా? దాని పేరేంటి?
తెలుసుకోగల మార్గమేంటి?
చినుకు తాకిన మట్టి సుగంధానికి కారణమేంటి?
చినుకా? మట్టా? అవి కలిసిన పరవశమా?
ఎండిపోతున్న గొంతును తాకిన నీటి రుచేంటి?
తియ్యనా? కమ్మనా? ఇంకా ఏదోనా?
ఇంద్రధనస్సు అందానికి మూలం ఏంటి?
ఎండా? వర్షమా? వాటి విరహ వేదనా?
అమ్మ ప్రేమకు నాన్న ఇష్టానికి వర్ణన ఏంటి?
ఉందా ? ఉన్నా భాషకు అందుతుందా ?
సంగీతం ప్రాణం ఎలా తడుతుంది?
సాహిత్యం ప్రాణం ఎలా పోస్తుంది ?
నవ్వు భారం ఎలా తగ్గిస్తుంది ?
ఒక తోడు ప్రపంచాన్ని అందంగా ఎలా మారుస్తుంది ?
కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అవసరం
కాని వీటికి ప్రశ్నలే సర్వస్వము
నా జీవితంలో నీ పాత్రేంటి?
నన్ను పడేసిన ఆటంకానివా ?
ఉరకాలి అనిపించిన ఆశవా?
నేను నేర్చుకున్న గుణపాఠానివా ?
నాకు మిగిల్చిన జ్ఞాపకానివా ?
నవ్వులను దూరం చేసిన రాక్షసివా ?
ఊహలకు ఊపిరి పోసిన దేవతావా ?
మరపు రాని గాయనివా ?
మరువలేని మధుర స్వప్నానివా ?
వెలుగు పంచే చందమామవా? చుట్టూ ఉన్న చీకటివా?
దాహం తీర్చే నీటి బిందువా? ముంచే వరదవా?
అందమైన రూపానివా? అందని తీరానివా?
కోరుకున్న వరానివా? వదిలిన శాపానివా?
నువ్వేంటో అర్ధమయ్యే వీలుందా ?
ఉన్నా నా మనసుకు అందుతుందా ?
నీ గురించి ప్రశ్నలకు సమాధానంగా పదాలు చాలవు
నీ స్నేహపు అసాధారణ శక్తికి హద్దులు లేవు
నిన్ను చూసినప్పుడే చచ్చాను , అప్పుడే బ్రతికాను
గుండె అప్పుడే ఆడింది, శ్వాస అప్పుడే ఆగింది
జీవితం హింసించినా భరించాను
నువ్వు నవ్వితే లొంగి పోయాను
నువ్వు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి పొంగాను
నువ్వున్న దూరాలు గుర్తుకు వచ్చి ప్రాప్తం లేదనుకున్నాను
చేతబడి చేసిన దయ్యానివా?
మంత్రం వేసిన మంత్రసానివా?
నువ్వు ప్రేమా? ఆకర్షణా? మైమరుపా?
Comments
Post a Comment